For Money

Business News

వడ్డీరేట్లు ఇక తగ్గవా?

వచ్చే ఏడాది అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు సందిగ్ధత నెలకొంది. రాత్రి ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక రేటు పావు శాతం తగ్గించింది. ఉపాధి అవకాశాలు బాగా తగ్గినందున వడ్డీ రేట్లను 3.50 – 3.75 శాతానికి తగ్గించినట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వెల్లడించారు. అయితే 2027లో వడ్డీ రేట్లు దాదాపు ఉండవనే టోన్‌లో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది పావు శాతం మేర వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్‌ ఉందని అన్నారు. గత సెప్టెంబరు, అక్టోబరు సమావేశాల్లోనూ అమెరికా ఫెడ్‌ రేట్లను తగ్గించిన ఫెడరల్‌ రిజర్వ్‌ మున్ముందు వడ్డీ రేట్ల కోతపై అనుమానం వ్యక్తం చేస్తోంది. 2026 మేలో ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ పదవీకాలం ముగియనుంది. ఆయన స్థానంలో కొత్త ఛైర్మన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటిస్తారు. ట్రంప్‌ మాత్రం మున్ముందు కూడా వడ్డీ రేట్లను ఇంకా తగ్గించాలని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. పావెల్‌ స్పీచ్‌ తరవాత అమెరికా ఫ్యూచర్స్‌లో జోష్‌ లేకపోవడం గమనించాల్సిన అంశం.