అన్నంత పని చేశాడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్‌పై మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇపుడు మన దేశంపై అమెరికా విధించే సుంకాల మొత్తం 50 శాతానికి చేరింది. ఇక పెనాల్టి ఉండనే ఉంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందున భారత్‌పై ఇది వరకే 25 శాతం సుంకం విధించారు ట్రంప్. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ళను ఆపకపోగా, రష్యాతో మీరు వ్యాపారం చేయడం లేదా అంటూ భారత్ ప్రశ్నించడంతో ట్రంప్ కోపం రెట్టింపు అయినట్లుంది. తనకు ఉన్న అధికారులను ఉపయోగించి భారత్‌పై మరో 25 శాతం సుంకం విధించారు. తాజా ఉత్తర్వులు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని అమెరికా ప్రకటించింది. ఇది వరకు విధించిన 25 శాతం సుంకాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తుండగా, కొత్తగా వేసిన 25 శాతం ఈనెల 27 నుంచి అమల్లోకి వస్తాయని అమెరికా వెల్లడించింది.