షేర్‌కు క్యూఐపీ బూస్ట్

క్యూఐపీ (Qualified Institutional Placement) ఇష్యూను ఎస్‌బీఐ ఇవాళ ప్రారంభించింది. ఈ ప్లేస్‌మెంట్ ద్వారా రూ. 25000 కోట్లన సమీకరించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఇష్యూ ధర రూ. 811.05గా నిర్ణయించింది. ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్‌తో బ్యాంక్ షేర్లను ఆఫర్ చేయనుంది. క్యూఐపీ న్యూస్‌తో ఇవాళ ఎస్‌బీఐ షేర్ 1.72 శాతం లాభంతో రూ. 830 వద్ద ముగిసింది. అంతకుమునుపు రూ. 834 స్థాయిని కూడా షేర్ తాకింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ కౌంటర్లో షేర్ల డెలివరీ 52 శాతం దాకా ఉండటం విశేషం. ఎస్‌బీఐ తాజా ఇష్యూలో అధిక భాగం వాటాను ఎల్‌ఐసీ తీసుకునే అవకాశం ఉంది. అలాగే పలు మ్యూచువల్ ఫండ్‌లు కూడా ఈ ఇష్యూపై ఆసక్తితో ఉన్నాయి.