For Money

Business News

మెప్పించని బోనస్‌ ప్రతిపాదన

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి బోనస్‌ ఇష్యూ రాబోతోంది. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు బ్యాంక్‌ బోర్డు ఈనెల 19న సమావేశం అవుతోంది. బోనస్‌ షేర్ల జారీతో పాటు ఇంటరిం డివిడెండ్‌ ఇచ్చే అంశంపై కూడా బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి రెండు సార్లు షేర్లు విభజన బ్యాంక్‌ తొలిసారి బోనస్‌ షేర్లను జారీ చేయనుంది. కంపెనీ బోర్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఫలితాలను కూడా జులై 19న జరిగే బోర్డు పరిగణనలోకి తీసుకోనుంది. ఇవాళ బ్యాంక్‌ షేర్లు 1.33 శాతం పెరిగి రూ.2,022 వద్ద గరిష్ఠాన్ని తాకినా.. క్లోజింగ్‌లో 1996 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ షేర్‌ కేవలం 0.03 శాతం పెరిగింది. గడచిన నెల రోజుల్లో షేర్‌ 5 శాతం పెరగ్గా, మూడు నెలల్లో 8 శాతం ప్రతిఫలం ఇచ్చింది. గత ఆరు నెలలను పరిగణనలోకి తీసుకుంటే బ్యాంక్‌ షేర్‌ రికార్డు స్థాయిలో 22 శాతం లాభాన్ని ఇచ్చింది.