ఫార్మాకు ట్రంప్ షాక్

ఫార్మా రంగానికి గట్టి షాక్ ఇచ్చే యోచనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. నిన్న రాత్రి జరిగిన కేబినెట్ భేటీ తరవాత ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా సుంకాల గడువు పెంచబోమని, ఆగస్టు 1 నుంచి సుంకాలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా కాపర్‌పై 50 శాతం, ఫార్మా దిగుమతులపై 200 శాతం దాకా సుంకం విధిస్తామని చేసిన ప్రకటన ఇపుడు స్టాక్ మార్కెట్‌లో కలకలం సృష్టిస్తోంది. అమెరికాలో ఫార్మా కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాలని లేదంటే భారీ సుంకాలు భరించాల్సిందేనని ట్రంప్ పునరుద్ఘాలించారు. నిన్నటి దాకా ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్న ఫార్మా కౌంటర్లు ఇవాళ ట్రంప్ ప్రకటనకు ఎలా స్పందిస్తాయో చూడాలి. డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా, దివీస్ ల్యాబ్ షేర్లపై ప్రభావం కన్పించే అవకాశముంది. అలాగే గ్లెన్ మార్క్, లుపిన్, జైడస్ లైఫ్ సైన్సస్, అరబిందో, గ్లాండ్ ఫార్మా కౌంటర్లలలో ఒత్తికి ఛాన్స్ ఉంది.