ట్రంప్ తడాఖా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో మళ్ళీ స్టాక్ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. ఆగస్టు 1 నుంచి 14 దేశాలపై సుంకాలు విధిస్తూ ట్రంప్ లేఖలు పంపిన విషయం తెలిసిందే. అనేక దేశాలపై 30 శాతంపైగా సుంకం విధించిన ట్రంప్. దీంతో రాత్రి అమెరికా మార్కెట్లు ఒక శాతం వరకు నష్టంతో ముగిశాయి. ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్ కూడా నష్టాల్లో ఉన్నాయి. అయితే ఆసియా మార్కెట్లు మాత్రం ట్రంప్ సుంకాలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే
బంగ్లాదేశ్‌పై 35 శాతం వాణిజ్య సుంకం విధించడంతో… దీనివల్ల భారత టెక్స్‌టైల్ కంపెనీలకు లాభం కలగవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఈ రంగానికి చెందిన షేర్లు వెలుగులో ఉండొచ్చు.