For Money

Business News

పేయూ చేతికి బిల్‌డెస్క

ఆన్‌లైన్‌ పేమెంట్స్‌కు సంస్థ అయిన బిల్‌డెస్క్‌ను ప్రొసస్‌ కంపెనీ టేకోవర్‌ చేసింది. బిల్‌డెస్క్‌ను ఏకంగా 470 కోట్ల డాలర్లకు అంటే సుమారు రూ. 35,000 కోట్లకు టేకోవర్‌ చేసింది. పే యూ (PayU) అనే ఫిన్‌టెక్‌ కంపెనీ మాతృసంస్థే ప్రొసస్‌. 2000లో ఆర్థర్‌ ఆండర్సన్‌ సంస్థలో పనిచేసిన ఎంఎన్‌ శ్రీనివాసు,అజయ్‌ కుషాల్‌, కార్తిక్‌ గణపతి కలిసి బిల్‌డెస్క్‌ను నెలకొల్పారు. మన దేశంలో లాభదాయకమైన అతి తక్కువ ఫిన్‌ టెక్‌ కంపెనీలలో బిల్‌ డెస్క్‌ ఒకటి. దేశంలోని అతి పెద్ద ఆన్‌లైన్‌ పేమెంట్‌ కంపెనీలలో ఇదొకటి. ఇప్పటి వరకు తాము భారత్‌లో 600 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టామని, బిల్‌డెస్క్‌ డీల్‌తో భారత్‌లో తమ పెట్టుబడుల మొత్తం 1000 కోట్ల డాలర్లను దాటిందని ప్రొసస్‌ కంపెనీ సీఈఓ బాబ్‌ వాన్‌ డిక్‌ తెలిపారు.