NIFTY TRADE: లాభాలు స్వీకరించండి
ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్లు పెరుగుతూ వస్తున్నాయి. అధిక స్థాయిల వద్ద కూడా నిఫ్టి చాలా ఈజీగా కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. చిన్న, మధ్యతరహా ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో లాభాలు స్వీకరించడం ఉత్తమమని స్టాక్ అనలిస్టులు సలహాలు ఇస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు క్రమంగా మన మార్కెట్ల నుంచి బయటపడుతున్నారు. నిన్న రూ. 1200 కోట్ల నికర కొనుగోలు చేసినా… పరిస్థితి చాలా నాజూగ్గా ఉంది. షేర్లు, సూచీలు ఆల్టైమ్ హైలో ఉన్నందున… తక్కువ లాభం కోసమైనా ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో పెట్టబుడి పెట్టాల్సి వస్తోంది.రిస్క్ చాలా ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో నిఫ్టి నుంచి బయటపడటం మంచిదని చిన్న, మధ్య తరహా ఇన్వెస్టర్లకు సలహా ఇస్తున్నారు. ఇక డే ట్రేడింగ్ విషయానికొస్తే నిఫ్టి క్రితం ముగింపు 16,931. సింగపూర్ నిఫ్టి ధోరణి చూస్తుంటే నిఫ్టి 16900 ప్రాంతంలో ప్రారంభం కావొచ్చు. నిఫ్టికి మద్దతు లభిస్తే 17,000 వరకు వెళ్ళొచ్చు. ఇటీవల పొజిషన్స్ తీసుకున్న ఇన్వెస్టర్లు నిఫ్టి ఏమాత్రం పెరిగినా బయటపడి… వెయిట్ చేయడం మంచిది. నిఫ్టి స్వల్పంగా క్షీణించినా.. కొనుగోలు చేయడం అనవసరం. నిఫ్టి 16,000-17,000 మధ్య నిలదొక్కుకునే వరకు వెయిట్ చేయడం మంచిది. చిన్న ఇన్వెస్టర్లు ఇక నిఫ్టిలో ట్రేడ్ చేయడం కన్నా… మంచి షేర్ల కోసం పరిశోధన చేయడం మంచిది.