ఎల్ఐసీలో విదేశీ సంస్థలకు 20 శాతం వాటా?
ప్రభుత్వ రంగ బ్యాంకుల మాదిరిగానే ఎల్ఐసీలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి అనుమతించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే 20 శాతం విదేశీ పెట్టుబడికి అనుమతిస్తారన్నమాట. ఈ ఏడాది చివర్లో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ ఇష్యూ ద్వారా కనీసం లక్ష కోట్ల రూపాయలు సమీకరించాలన్నది మోడీ ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటికే ఐపీఓ కోసం బ్యాంకర్ల ఎంపిక కూడా దాదాపు పూర్తి కావొచ్చింది.