For Money

Business News

భారీగా క్షీణించిన బంగారం ధర

సుంకాలకు సంబంధించి అమెరికా, చైనా మధ్య ఒప్పందం కుదరడంతో కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ భారీగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ ఒకటిన్నర శాతం పెరగడంతో బులియన్‌ మార్కెట్‌లో ధరలు భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్టాండర్డ్‌ బంగారం ఔన్స్‌ ధర3 వేల 200 డాలర్లకు పడిపోయింది. దీంతో వర్ధమాన దేశాల్లో బంగారంపై డబుల్‌ భారం పడింది. భారత మార్కెట్‌లో స్పాట్‌ మార్కెట్‌లో స్టాండర్డ్‌ బంగారం పది గ్రాముల ధర 4 వేల 500 రూపాయల వరకు పడిపోయింది. అలాగే ఎంసీఎక్స్‌లో అంటే ఫ్యూచర్స్‌లోనూ బంగారం ధర తగ్గింది. తాజా సమాచారం మేరకు జూన్‌ నెల స్టాండర్డ్‌ బంగారం కాంట్రాక్ట్‌ 3వేల 800 రూపాయల వరకు క్షీణించంది. ధర 92 వేల 7వందలకు పడిపోయింది. అలాగే ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర వెయ్యి 500 రూపాయలు తగ్గింది. అమెరికా డీల్‌ కారణంగా మున్ముందు బంగారం ధర క్షీణించే అవకాశముంది.