For Money

Business News

టెలికాం చార్జీలను పెంచుతాం

టెలికాం చార్జీలు పెంచడానికి ఇది సరైన సమయని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు. ఒక వేచి ఉండే ఓపిక లేకనే పోస్ట్‌ పెయిడ్‌ చార్జీలను పెంచామని ఆయన అన్నారు. చార్జీలు ఇంకా పెంచాల్సిన అవసరం ముందని ఆయన అన్నారు. (వోడాఫోన్‌ పూర్తిగా మునిగిపోయిన తరవాత కంపెనీలు చార్జీలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి) కంపెనీకి ఒక్కో వినియోగదారుడి నుంచి సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) ఈ ఏడాది రూ. 200లకు చేరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్లు సమీకరించాలని నిర్ణయించిన తరవాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రమోటర్ల వాటా తగ్గించుకోమని స్పష్టం చేశారు. అంటే రైట్స్‌ ఇష్యూలో తన వాటా మొత్తానికి సబ్‌స్క్రియిబ్‌ చేస్తామని ఆయన చెప్పారు. కంపెనీ అప్పులు భారీగా ఉన్నాయని… రైట్స్‌ ద్వారా సమీకరించే మొత్తం ఇండస్‌ పవర్‌లో వాటా పెంచుకునేందుకు ఉపయోగించమని స్పష్టం చేశారు.