For Money

Business News

OMC కేసు: గాలికి ఏడేళ్ళ జైలు శిక్ష

ఓబులాపురం మైనింగ్‌ కేసులో మైనింగ్‌ డాన్‌ గాలి జనార్ధన్‌ రెడ్డికి ఏడేళ్ళ కారాగార శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. 14 ఏళ్ళ విచారణ తరవాత ఈ కేసులో ఇవాళ కోర్టు తీర్పు ప్రకటించింది. ఈకేసులో తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి క్లీన్‌ ఇచ్చింది. అలాగే ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిని దోషిగా తేల్చింది. అయితే ఈ కేసు నుంచి హైకోర్టు ఇప్పటికే ఆమెను తొలగించింది. దీంతో ఆమెకు శిక్ష వర్తించదు. గాలి జనార్ధన్‌ రెడ్డితో పాటు బి వీ శ్రీనివాస్‌ రెడ్డి, ఐఏఎస్‌ అధికారి వి.డి. రాజ్‌గోపాల్‌, ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ, రావు లింగారెడ్డి (మృతి చెందారు) కె మహఫూస్‌ ఖాన్‌కు దోషిగా తేల్చిన కోర్టు ఏడేళ్ళ శిక్ష విధించింది. కోర్టు తీర్పు వెలువడక ముందు హాజరైన గాలి జనార్ధన్‌ రెడ్డి తన వయసును, సామాజిక సేవను దృష్టిలో పెట్టుకొని శిక్ష తగ్గించాలని కోర్టును వేడుకున్నారు. ఐఏఎస్‌ అధికారి కృపానందను నిర్దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు.