For Money

Business News

మిడ్‌ క్యాప్స్‌కు భారీ నష్టాలు

మార్కెట్‌ ఒక మోస్తరు నష్టాలతో ముగిసినట్లు కన్పిస్తున్నా… మిడ్‌ క్యాప్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా ఇవాళ పీఎస్‌యూ బ్యాంకులు, రియాల్టి షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిఫ్టి నెక్ట్స్‌ 50 సూచీ రెండున్నర శాతం నష్టపోయింది. ఎస్‌బీఐ ఫలితాలు బాగా లేకపోవడం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాదీ అదే పరిస్థితి కావడంతో బ్యాంక్‌ నిఫ్టి ఒక శాతంపైగా నష్టపోయింది. అయితే నిఫ్టి ఆరంభంలో గ్రీన్‌లో ఉన్నా… కొన్ని నిమిషాల్లోనే రెడ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి రోజంతా నష్టాల్లోనే ఉంది. నిఫ్టి81 పాయింట్ల నష్టంతో 24378 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో 2946 షేర్లు ట్రేడవగా, 2331 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టిలో ఇవాళ టాప్ గెయినర్‌గా హీరో మోటోకార్ప్‌ నిలిచింది. తరవాతి స్థానాల్లో భారతీ ఎయిర్‌టైల్‌, హెచ్‌యూఎల్‌, టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం ఉన్నాయి. నిన్న భారీగా పెరిగిన అదానీ షేర్లలో ఇవాళ లాభాల స్వీకరణ వచ్చింది. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ముందుంది. ఈ షేర్‌ ఇవాళ 4 శాతంపైగా నష్టపోయింది. తరువాతి స్థానాల్లో జియో ఫైనాన్స్‌, ఎటర్నల్‌, ట్రెంట్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఉన్నాయి.