ట్రెంట్ లాభం భేష్

మార్చితో ముగిసిన త్రైమాసికంలో ట్రెంట్ కంపెనీ నికర లాభం మార్కెట్ అంచనాలను మించింది. ఈ త్రైమాసికంలోకంపెనీ రూ. 303 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని మార్కెట్ అంచనాలు వేయగా, కంపెనీ రూ. 354 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అయితే కంపెనీ టర్నోవర్ రూ. 4106 కోట్లకు చేరింది. టర్నోవర్ మార్కెట్ అంచనాలకు అనుగుణంగా లేకున్నా నికర లాభం మాత్రం అంచనాలను మించింది. మార్జిన్ 16 శాతం కంపెనీ పేర్కొంది. పూర్తి ఏడాదికి చూస్తే కంపెనీ నికర లాభం 46 శాతం క్షీణించింది. డిసెంబర్ నెలాఖరుతో పోలిస్తే కంపెనీ టర్నోవర్ 29 శాతం పెరగ్గా, నికర లాభం 25 శాతం తగ్గింది. ఫలితాల తరవాత షేర్ మాత్రం 5 శాతంపైగా పెరిగింది.