గరిష్ఠ స్థాయిలో…

ఉదయం చాలా డల్‌గా ప్రారంభమైన నిఫ్టి క్రమంగా పుంజుకుని గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 289 పాయింట్ల లాభంతో 24328 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి ఐటీ స్వల్ప నష్టాలతో ముగిసింది. మిగిలిన ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి. ఇవాళ 2992 షేర్లు ట్రేడవగా, 1532 షేర్లు గ్రీన్‌లో… 1375 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంటే మార్కెట్ ధోరణి తటస్థంగా ఉందన్నమాట. ఇవాళ రిలయన్స్ దాదాపు 5 శాతం లాభంతో ముగిసింది. ఇటీవలి కాలంలో ఈ కౌంటర్ ఈ స్థాయి లాభాలతో ముగియడం ఇదే మొదటిసారి. నిఫ్టి షేర్లలో రిలయన్స్ తరవాత సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీఈఎల్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాలతో ముగిశాయి. ఇవాళ శ్రీరామ్ ఫైనాన్స్ 5 శాతం నష్టంతో ముగిసింది నిఫ్టి షేర్లలో. ఆరంభంలో 8 శాతం దాకా నష్టపోయిన ఈ కౌంటర్ తరవాత కోలుకుంది. ఇంకా ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్ షేర్లు ఉన్నాయి.