For Money

Business News

పాక్‌ టూరిస్టులకు నో ఎంట్రీ

ప్రస్తుతం భారత దేశంలో పర్యటిస్తున్న పాకిస్తాన్‌ పర్యాటకులను తక్షణం వెళ్ళిపోవాలని భారత్‌ ఆదేశించింది. పహల్‌గావ్‌ దాడి వెనుక పాకిస్థాన్‌ హస్తం ఉందని భావిస్తోంది. ఇవాళ జరిగిన భద్రత వ్యవహారల కేబినెట్‌ కమిటీలో భారత్‌ పలు సంచల న నిర్ణయాలను తీసుకుంది. ఇపుడు దేశ పర్యటనలో ఉన్నవారితో పాటు ప్రత్యేక వీసాదారులు రాగల 48 గంటల్లో భారత్‌ను వీడాలని ఆదేశించినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ తెలిపారు. సీసీఎస్‌ఏ భేటీ వివరాలను ఆయన మీడియాకు వివరించారు. పాకిస్తాన్‌ కుదుర్చుకున్న సింధూ జలాల ఒప్పందాన్ని తక్షణం నిలిపివేయాలని కూడా కేబినెట్‌ కమిటీ నిర్ణయించింది.వాఘ సరిహద్దును మూసివేస్తున్నామని, ఇప్పటికే భారత్‌లోకి వచ్చినవారు మే 1వ తేదీలోగా భారత్‌ వీడాలని ఆదేశించింది. ఇక నుంచి పాకిస్తాన్‌ పౌరులను భారత్‌లోకి అనుమతించమని స్పష్టం చేసింది.