ఐపీఓ ఆఫర్ ధర ఖరారు

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈవీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారైంది. మార్కెట్ నుంచి రూ.2,981 కోట్ల సమీకరణకు ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్ చేయనుంది. షేరు ధరల శ్రేణిని రూ.304-321గా పేర్కొంది. ఈ పబ్లిక్ ఆఫర్ ఈనెల 28 ప్రారంభమై 30న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈనెల 25న షేర్లను కేటాయిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెయిన్ బోర్డు నుంచి పబ్లిక్ ఆఫర్‌కు వస్తున్న తొలి ఐపీఓ ఇదే కావడం విశేషం. తాజా షేర్ల జారీ ద్వారా రూ.2,626 కోట్లు సమీకరించనున్న ఈ కంపెనీ ప్రమోటర్లు మరో 1.1 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. 75 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించింది. 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NII), 10 శాతం షేర్లను మాత్రం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.