ఐటీ అండగా…

ఇవాళ ఆల్టైమ్ రికార్డు స్థాయిలో బ్యాంక్ నిఫ్టి ఒత్తిడి ఎదుర్కొంది. దాదాపు ప్రధాన ప్రైవేట్ బ్యాంకుల ఫలితాలు రావడంతో ఇక ఈ రంగంలో ఇప్పట్లో మ్యాజిక్కులు లేవు. ఇక పీఎస్బీఐ బ్యాంకులపైనే ఇన్వెస్టర్ల దృష్టి ఉంది. ఇవాళ స్టార్ రంగం ఐటీ సెక్టార్. నిన్న భారీ లాభాలతో ముగిసిన ఐటీ నిఫ్టి ఇవాళ కూడా ఏకంగా నాలుగు శాతంపైగా లాభపడింది. ఉదయం ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైనా… 11 గంటల ప్రాంతంలో నిఫ్టి నష్టాల్లోకి జారుకుంది. అయితే 24119 వద్ద గట్టి మద్దతు అందడంతో నిఫ్టి ఆకర్షణీయ లాభాలను పొందింది. క్రితం ముగింపుతో పోలిస్తే 182 పాయింట్ల లాభంతో నిఫ్టి 24328 వద్ద ముగిసింది. నిఫ్టి బ్యాంక్, నిఫ్టి ఫైనాన్స్ సూచీలు అరశాతం నష్టంతో ముగిశాయి. మార్కెట్ అండర్ టోన్ సూచీలకు భిన్నంగా ఉంది. ఇవాళ 2931 షేర్లు ట్రేడవగా 1516 షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. నష్టాల్లో ముగిసిన షేర్ల సంఖ్య 1340. రేపు మార్కెట్లో ఏప్రిల్ డెరివేటివ్స్ క్లోజంగ్ ఉంది. అందుకే అనేక షేర్లలో ఇవాళ గట్టి షార్ట్ కవరింగ్ వచ్చింది.