For Money

Business News

ఏథర్‌ ఎనర్జి ఐపీఓ 28 నుంచి

బెంగళూరుకు చెందిన ఈవీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ పబ్లిక్‌ ఇష్యూ ఈనెల 28న ప్రారంభం కానుంది. 30న ముగుస్తుంది. 25వ తేదీన యాంకర్‌ ఇన్వెస్టర్లకు కేటాయింపులు చేస్తారు. పబ్లిక్‌ ఆఫర్‌ కింద మార్కెట్‌ నుంచి కంపెనీ రూ.2,626 కోట్లను సమీకరించనుంది. నిజానికి పబ్లిక్‌ ఆఫర్‌ కింద రూ.3,100 కోట్లు సమీకరించాలని తొలుత భావించినా.. తరవాత ఇష్యూను తగ్గించింది. ధరల శ్రేణిని రేపు అంటే బుధవారం ప్రకటిస్తారు. కంపెనీ గతంలో 2.2 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించాలని భావించారు. అయితే దీన్ని కూడా 1.1. కోట్ల షేర్లకు తగ్గించారు. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు తమ వాటాలను ఆ మేర తగ్గించుకోనున్నారు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులలో రూ. 927 కోట్లతో మహారాష్ట్రలో కొత్త ఈవీ తయారీ యూనిట్‌ను నెలకొల్పుతారు. మరో రూ. 40 కోట్లను పాత రుణాలను చెల్లించేందుకు ఉపయోగిస్తారు. రీసెర్చి, డెవలప్‌మెంట్‌ కోసం రూ. 750 కోట్లు, మార్కెట్‌ ఖర్చుల కోసం మరో రూ. 300 కోట్లను కంపెనీ వినియోగించనుంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ ఖర్చులకు ఉపయోగిస్తారు.