For Money

Business News

కొనసాగిన ర్యాలీ

స్టాక్‌ మార్కెట్‌లో ఇవాళ కూడా ర్యాలీ కొనసాగింది. నిన్న రాత్రి వాల్‌స్ట్రీట్‌ పతనాన్ని మార్కెట్‌ అస్సలు పట్టించుకోలేదు. ఆరంభంలో 24072 పాయింట్లను తాకినా… వెంటనే కోలుకుని మిడ్‌ సెషన్‌కల్లా నిఫ్టి 24242 పాయింట్లకు చేరింది. ఐటీ వంటి ఒకట్రెండు రంగాలు మినహా ప్రధాన సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టిలో మాత్రం గట్టి ర్యాలీ కొనసాగింది. ఇవాళ ఈ సూచీ0.82 శాతం పెరగడం విశేషం. ఇవాళ 2986 షేర్లు ట్రేడవగా, 1834 షేర్లు లాభాల్లో ముగిశాయి. అలాగే 155 షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌తో ముగిశాయి. నిఫ్టిలో ఐటీసీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. తరువాతి స్థానంలో హిందుస్థాన్‌ లీవర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీసీఐ బ్యాంక్‌, జియో ఫైనాన్స్‌, ఎం అండ్‌ ఎం షేర్లు ఉన్నాయి. ఇక నిఫ్టిలో టాప్‌ లూజర్‌గా ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్ నిలిచింది. ఈ షేర్‌ దాదాపు 4 శాతం నష్టపోయింది. ఇక తరవాతి స్థానంలో ఉన్న షేర్లలో పవర్‌ గ్రిడ్‌, హీరో మోటో కార్ప్‌, ఇన్ఫోసిస్‌, విప్రో ఉన్నాయి.