బంగారం మరో రికార్డు

అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధర ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బకు డాలర్ బక్కచిక్కి పోయింది. తాజా సమాచారం మేరకు డాలర్ ఇండెక్స్ 100లోపునకు పడిపోయింది. దీంతో అమెరికా బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 3,240 డాలర్లని తాకింది. ఇదే సమయంలో భారత మార్కెట్‌లో కూడా అప్‌ట్రెండ్ కొనసాగుతోంది. MCXలో జూన్ కాంట్రాక్ట్ పది గ్రాముల బంగారం ధర రూ. 93,736 తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే బంగారం ధర ఇవాళ ఉదయం రూ. 1552 పెరిగింది.