ఈసారీ సాధారణ వర్షాలు

రైతులకు శుభవార్త. ఈసారి కూడా సాధారణ వర్షపాతాలు ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో ఈసారి సాధారణ వర్షపాత ఉంటుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కయ్‌మెట్ వెదర్ అంచనా వేసింది. ఈ ఏడాది ఎల్ నినో లేదా ఎల్ నినా ఉండవని స్పష్టం చేసింది. జున్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంగా మనదేశంలో పడే వర్షాల గురించి ప్రభుత్వ, ప్రైవేట్ వాతావరణ కేంద్రాలు ముందస్తు అంచనాలను విడుదల చేస్తుంటాయి. ప్రైవేట్ సంస్థ స్కయ్‌మెంట్ వేసిన అంచనా ప్రకారం స్వల్పం కాలం వరకు ఉండొచ్చని.. అయితే దీని ప్రభావం పంటలపై పెద్దగా ఉండదని పేర్కొంది. ఈ సీజన్‌లో ఎల్ నినో వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ వర్షాకాలంలో ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధంలో వర్షాలు బాగుంటాయని స్కయ్ మెట్ వెల్లడించింది. వెస్టర్న్ ఘాట్స్, కేరళ, కోస్టల్ కర్ణాటకతో పాటు గోవాలో ఈసారి అధిక వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. ఈ ప్రాంతం ఆనుకునే ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణ వర్ష పాతం నమోదవుతుందని పేర్కొంది. అయితే ఉత్తర భారతంలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు పడుతాయని పేర్కొంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు సాధారణం కంటే తక్కువ ఉంటాయని పేర్కొంది. మధ్యప్రదేశ్‌తో పాటు మహారాష్ట్రల్లో మాత్రం సాధారణ వర్షాలు ఉంటాయని స్కయ్‌మెట్ అంచనా వేసింది.