For Money

Business News

క్రూడ్‌ ఢమాల్‌…

అమెరికాలో మాంద్యం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ డాలర్‌ ఇండెక్స్‌ 2 శాతంపైగా క్షీణించింది. డాలర్‌ బలహీన పడటంతో పెరగాల్సిన క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా క్షీణించాయి. అమెరికా మార్కెట్‌లో విక్రయించే WTI క్రూడ్‌ ధర 7 శాతంపైగా పడగా, ఆసియా మార్కెట్లలో అమ్మే బ్రెంట్ క్రూడ్‌ ధర 6 శాతంపైగా క్షీణించింది. డాలర్‌ వీక్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుంటే వాస్తవంగా క్రూడ్‌ భారీగా క్షీణించినట్లే. ఇదే సమయంలో డాలర్‌ వీక్‌నెస్‌ కారణంగా పెరగాల్సిన బంగారం ధర.. దాదాపు ఒక శాతం క్షీణించింది. అయితే పారిశ్రామిక అవసరాల డిమాండ్‌ కారణంగా పెరిగిన వెండి.. ఇపుడు భారీగా క్షీణించింది. తాజా సమాచారం మేరకు వెండి 7 శాతంపైగా క్షీణించింది.