తక్కువ షేర్లకు భారీ నష్టాలు

ఇవాళ మార్కెట్లో మెజారిటీ షేర్లు లాభాల్లో ముగిశాయి. మొత్తం 2994 షేర్లు ట్రేడవగా 1955 షేర్లు గ్రీన్లో క్లోజ్ కాగా, 960 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అయితే ఈ షేర్ల నష్టాలు భారీగా ఉండటంతో సూచీ నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. నిఫ్టి ఏకంగా 1.5 శాతం, సెన్సెక్స్ 1.8 శాతం చొప్పున నష్టపోయాయి. అలాగే ఇవాళ అప్పర్ సర్క్యూట్లో ముగిసిన షేర్లు 275 కాగా, లోయర్ సర్క్యూట్లో ముగిసిన షేర్ల సంక్య 46 మాత్రమే. నిఫ్టి విషయానికొస్తే 353 పాయింట్ల నష్టంతో 23165 వద్ద క్లోజ్ కాగా, సెన్సెక్స్ 1390 పాయింట్లు నష్టపోయింది. అలాగే నిఫ్టి బ్యాంక్ కూడా 1.43 శాతం నష్టంతో క్లోజైంది. ప్రధాన సూచీలలో నిఫ్టి ఐటీ ఏకంగా 2.45 శాతం నష్టపోయింది. ప్రైవేట్ బ్యాంకులు ఇవాళ బాగున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ 5 శాతంపైగా లాభపడింది. అలాగే ట్రెంట్ కూడా 5 శాతం దాకా లాభంతో ముగిసింది. నష్టపోయిన నిఫ్టి షేర్లలో హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీఈఎల్ ఉన్నాయి.