దుమ్ము రేపిన వెండి

ప్రపంచ వ్యాప్తంగా మెటల్స్ దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా పరిశ్రమల్లో వాడే మెటల్స్‌కు డిమాండ్ జోరుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనపడటంతో కాపర్, సిల్వర్ భారీగా పెరిగాయి. ముఖ్యంగా భారత మార్కెట్‌లో కాపర్ రెండు శాతం పెరగ్గా, వెండి 1.5 శాతం పెరిగింది. తాజా సమాచారం మేరకు సిల్వర్ మే కాంట్రాక్ట్ ఇపుడు రూ. 97,620 వద్ద ట్రేడవుతోంది. క్రితం ధరతో పోలిస్తే ఇవాళ వెండి ధర రూ. 1400పైనే పెరిగింది. అయితే బంగారం ధరల్లో పెద్ద మార్పు లేదు. దాదాపు క్రితం ముగింపు వద్దే అంటే రూ. 86150 వద్ద (పది గ్రాముల స్టాండర్డ్ బంగారం) ఏప్రిల్ కాంట్రాక్ట్ ట్రేడవుతోంది.