అమెరికా సుంకాల దెబ్బ పెద్దదే

వచ్చే నెల 2వ తేదీ నుంచి భారత్ నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను పెంచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇవాళ ఆయన కాంగ్రెస్‌లో ప్రసంగిస్తూ తమ ఉత్పత్తులపై భారత అధిక సుంకాలు విధిస్తోందని ఆరోపించారు. అమెరికా గనుక మన దేశ వస్తువులపై సుంకాల పెంచే పక్షంలో భారత్‌కు ఏడాదికి 700 కోట్ల డాలర్ల మేర నష్టం రానుంది. వివిధ అంతర్జాతీయ రీసెర్చి సంస్థల ప్రతినిధులతో మాట్లాడిన తరవాత అమెరికా చర్యల వల్ల భారత్‌కు జరిగే నష్టం గురించి బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ ఓ వార్త రాసింది. ప్రస్తుతం భారత వస్తువులపై అమెరికా విధిస్తున్న సంకం, అలాగే అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాల్లో తేడా పది శాతంపైగానే ఉన్నట్లు ఈ వార్తా సంస్థ వెల్లడించింది. భారత్‌తో పాటు థాయ్‌ల్యాండ్‌పై అమెరికా 4 శాతం నుంచి 6 శాతం వరకు అదనపు సుంకం విధించే అవకాశముంది.