For Money

Business News

మనకే ఎందుకీ పరిస్థితి?

గడచిన 35 ఏళ్ళలో ఇంతటి షార్ప్‌ కరెక్షన్‌ లేదంటున్నారు స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు. ఏకంగా ఆరో నెల కూడా మార్కెట్‌ పడుతున్నా ఎక్కడా కోలుకునే ఆనవాళ్ళు కన్పించడం లేదు. పోతే పోనీ… విదేశీ ఇన్వెస్టర్లు… మనకు మన రీటైల్‌ ఇన్వెస్టర్లు ఉన్నారు కదా.. అంటూ ఇన్నాళ్ళు ఢాంబికాలు పలికిన ఆర్థిక వేత్తలు ఇపుడు టీవీలో కన్పించడం లేదు. మన టీవీ ఛానల్స్‌లో మన ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం విదేశీ ఇన్వెస్టర్లు చేయరు. అందుకే అమెరికా సీఎన్‌బీసీ ఈ అంశంపై చర్చ చేపట్టింది. అందుకూ భారత్‌ మార్కెట్ సూపర్‌ అంటుంటే… విదేశీ ఇన్వెస్టర్లు ఎందుకు చైనాకు వెళ్ళిపోతున్నారో ఈ చర్చలో విశ్లేషించారు. వెల్త్‌మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు చెందిన చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్స్‌ అయిన గారెత్‌ నికల్సన్‌, ఫ్లోరెన్‌ వెండర్‌ ఈ చర్చలో పాల్గొన్నారు. ఇప్పటికే అమెరికా ఇన్వెస్టర్లకు భారత మార్కెట్‌ ఆకర్షణీయంగా ఉన్నా… చైనాలో వస్తున్న మార్పుల కారణంగా అమ్మకాలకు పాల్పడుతున్నారని వీరు అన్నారు. వీరి చెప్పిన కీలక అంశాలు…
1.భారత్‌ నుంచి సుమారు 2000 కోట్ల డాలర్లను పెట్టుబడులను విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ నుంచి వెనక్కి తీసుకున్నారు. ఇందులో చాలా భాగం చైనా మార్కెట్‌కు తలించారు. దీనికి కారణం వాల్యూయేషన్స్ అక్కడ బాగుండటమే.
2. భారత్‌తో పోలిస్తే చైనాలో షేర్ల వ్యాల్యూయేషన్స్‌ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. చైనా కంపెనీలు ఇటీవల చాలా ఇబ్బందులు పడుతుండగా… అక్కడి ప్రభుత్వం ఇచ్చిన స్టిములస్‌తో ఇపుడు బాగా రాణిస్తున్నాయి. చైనాలో షేర్ల వ్యాల్యూయేషన్‌ తక్కువగా ఉండటం, అక్కడి కంపెనీలకు అక్కడి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు చాలా కీలకంగా మారింది.
3. సైకాలజీ కూడా బాగా మారింది. చైనాలో ఉన్న యానిమల్‌ స్పిరిట్‌ ఇండియాలో లేదు. ఇపుడు ఇన్వెస్టర్లు చైనా స్టోరీని నమ్ముతున్నారు. దీంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ బాగా మారింది. దీంతో చాలా మంది విదేశీ ఇన్వెస్టర్లు చైనాకు ఆకర్షితులవుతున్నారు.
4. భారత్‌లో అంతర్గత సమస్యలు చాలా ఉన్నాయి. కన్జూమర్‌ బ్యాలెన్స్‌ భారత్‌లో లేదు. గతంలో మాదిరి కన్జూమర్స్‌ కొనుగోళ్ళు లేవు. వారి కొనుగోలు శక్తి తగ్గుతోంది. ఇదే సమయంలోఎ స్టాక్‌ మార్కెట్‌ కూడా క్షీణిస్తోంది. దీంతో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు.
5. చైనా ప్రభుత్వం మద్దతు అక్కడి కంపెనీలకు చాలా కీలకంగా మారింది.అలాగే చైనా కంపెనీలకు కూడా సపోర్ట్ లభిస్తోంది. హెచ్‌ షేర్స్‌ కొనేందుకు స్థానిక కంపెనీలను చైనా ప్రోత్సహిస్తోంది.
6. భారత్‌లో టెక్‌ వాతావరణం చాలా నిరాశాజనకంగా ఉంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు అవసరమైన హార్డ్‌వేర్‌ను తయారు చేసే స్థితిలో భారత్‌ లేదు. అక్కడి ఎకో సిస్టమ్‌ అందుకు అనుకూలంగా లేదు. భారత్‌ టెక్‌ సిస్టమ్‌ విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడం లేదు.
7. భారత సూచీల గ్రోత్‌ స్టోరీపై విదేశీ ఇన్వెస్టర్లకు నమ్మకం సడలింది. ఎంపిక చేసిన రంగాల్లో మాత్రమే విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు.
8. పవర్‌ సెక్టార్‌తో పాటు మరొక రంగంపై మాత్రమే విదేశీ ఇన్వెస్టర్లకు ఆసక్తి ఉంది.
9. చైనా స్టిములస్‌ ప్యాకేజీ ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంది. బై బ్యాక్స్‌ను అక్కడి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
10. భారత దేశ వృద్ధి రేటు పెరిగేందుకు అక్కడి ప్రభుత్వం చొరవ చూపాలి. భారత ఆర్థిక మంత్రి ఇటీవల బడ్జెట్‌లో ఇచ్చిన రాయితీలను బట్టి చూస్తే… భారత్‌లో కన్జూమర్ డిమాండ్‌ లేదని స్పష్టమౌతోంది.