For Money

Business News

మూడో వంతు నష్టాల్లో…

మార్కెట్‌ స్థిరంగా ముగిసినట్లు సూచీలు చెబుతున్నా… మెజారిటీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ 3000లకుపైగా షేర్లు ట్రేడవగా, నష్టాలతో ముగిసిన షేర్ల సంఖ్య 2000పైనే ఉంది. 875 షేర్లు లాభాల్లో ముగిశాయి. 961 షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిలో క్లోజ్‌ కాగా, కేవలం 12 షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. అలాగే ఇవాళ 356 షేర్లు లోయర్‌ సర్క్యూట్‌లో క్లోజ్‌ కాగా, అప్పర్‌ సర్యూట్‌లో ముగిసిన షేర్ల సంఖ్య కేవలం 49. ఇక సూచీల విషయానికొస్తే నిఫ్టి 5 పాయింట్ల నష్టంతో 22119 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటీ షేర్ల సూచీ దాదాపు ఒక శాతం లాభం పొందినా ఫలితం లేకపోయింది. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి అర శాతం, నిఫ్టి ఫైనాన్షియల్‌ షేర్ల సూచీ 0.33 శాతంపైగా నష్టంతో ముగిశాయి. ఉదయం ఒక మోస్తరు లాభాలతో నిఫ్టి ప్రారంభమైనా… వెంటనే అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దీంతో నిఫ్టి 22004ను తాకింది. తరవాత కోలుకున్నా… ఫలితం లేకపోయింది. లాభనష్టాలతో దోబూచులాడిన నిఫ్టి చివరికి క్రితం స్థాయి వద్దే ముగిసింది. ఇవాళ 4.5 శాతం లాభంతో బీఈఎల్‌ షేర్‌ నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇక బజాజ్‌ ఆటో 2.44 శాతం నష్టంలో టాప్‌ లూజర్‌గా నిలిచింది.