For Money

Business News

నిఫ్టి లాభాల్లో మొదలైనా…

గిఫ్ట్‌ నిఫ్టి 97 పాయింట్ల లాభం చూపిస్తోంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ప్రారంబమయ్యాయి. ముఖ్యంగా టెక్‌ షేర్లయిన టెస్లా, ఎన్‌విడియా షేర్లు నాలుగు శాతం మేర లాభంతో ముగిశాయి. దీంతో ఇవాళ మన మార్కెట్లలో కూడా ఐటీ, టెక్‌ షేర్లలో ఆసక్తి కనిపించే అవకాశముంది. అయితే ఉక్రెయిన్‌, రష్యా వ్యవహారం మళ్ళీ గందరగోళంగా మారింది. ఉక్రయిన్‌కు యూరప్‌ దేశాలు అండగా మారాయి. మరి రష్యా, అమెరికా ఒకవైపు నిలుస్తాయా అన్నది తెలియడం లేదు. ఈ అనిశ్చితి కారణంగా క్రూడ్‌ ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి లాభాల్లో ప్రారంభమైనా… చివరిదాకా నిలబడుతాయా అన్నది చూడాలి. ఎందుకంటే ఆసియా మార్కట్లు ముఖ్యంగా జపాన్‌, హాంగ్‌సెంగ్‌ సూచీలు ఒకటిన్నర శాతం లాభంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి చివరిదాకా ఆరంభం లాభాలను కొనసాగే ఛాన్స్‌ ఉంది. అయితే టెక్నికల్‌ అనలిస్టులు మాత్రం సెల్‌ ఆన్ రైజ్‌ ఫార్ములానే ఫాలో అవమని అంటున్నారు. నిఫ్టి 22000 స్థాయిని కోల్పోవడం ఖాయమని చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల లాభాలకే తొందరపడి కొనుగోలు చేయొద్దని లాంగ్‌ టర్మ్‌ ఇన్వెస్టర్లను కోరుతున్నాయి.