For Money

Business News

కనిష్ఠ స్థాయి వద్ద…

మార్కెట్‌ ఇవాళ కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. గత కొన్ని రోజులుగా కాస్త నిలకడగా ఉన్న మార్కెట్‌ మార్చి డెరివేటివ్స్‌ ఓపెనింగ్‌ రోజే భారీ నష్టాలతో ముగిసింది. రాత్రి అమెరికా మార్కెట్లలో ముఖ్యంగా నాస్‌డాక్లో వచ్చిన సెల్‌ఆఫ్‌ ప్రభావం ఇవాళ మన ఐటీ షేర్లపై కన్పించింది. ఇవాళ ఐటీ సూచీ అత్యధికంగా 4 శాతంపైగా నష్టపోయింది. దాదాపు అన్ని ప్రధాన రంగాల సూచీలు ఇవాళ నష్టాలతో ముగిశాయి. నిఫ్టి 420య పాయింట్ల నష్టంతో 22124 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 1414 పాయింట్ల నష్ఠంతో 73181 పాయింట్ల వద్ద క్లోజైంది. గత కొన్ని రోజులుగా మార్కెట్‌కు అండగా ఉన్న నిఫ్టి బ్యాంక్‌ కూడా దాదాపు ఒక శాతం నష్టంతో ముగిసింది. మార్కెట్‌కు ఏ దశలోనూ మద్దతు అందడం లేదు. అన్ని కౌంటర్లలో అమ్మకాలు సాగుతున్నాయి. ముఖ్యంగా కెనడా, మెక్సికోపై మార్చి నెల 4 నుంచి సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం తప్పదనే సంకేతాలు వెళ్ళాయి. దీంతో భారత్‌ వంటి ప్రధాన వర్ధమాన దేశాల మార్కెట్లపై ఒత్తిడి పెరుగుతోంది. వేసవి ఈసారి కూడా దంచేస్తుందన్న ఐఎండీ అంచనాలను కేవలం ఏసీ అమ్మే కంపెనీలు మినహా… మిగిలిన రంగాల్లో ఎక్కడా కొనుగోళ్ళ ఆసక్తి కన్పించలేదు. ఇవాళ 2972 షేర్లు ట్రేడవగా, 490 షేర్లు మాత్రమే గ్రీన్‌లో ముగిశాయి. 2414 షేర్లు నష్టాలతో క్లోజయ్యయి. ఇవాళ మొత్తం 789 షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకాయి. బేర్‌ ఫేజ్‌లోకి ఎంటరైన మార్కెట్‌… ఎపుడు కోలుకుంటోందన్న అంశంపై క్లారిటీ లేనందున చాలా మంది ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉంటున్నారు.