For Money

Business News

మరింత తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు మరింత క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లలో బులియన్‌ మార్కెట్‌ బలహీనంగా ఉంది. డాలర్‌ పెరగడంతో ఔన్స్‌ బంగారం ధర 2900 డాలర్ల లోపునకు పడింది. ప్రస్తుతం 2888 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే ఔన్స్‌ వెండి ధర కూడా 31.75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ రెండు మెటల్స్‌ 1.5 శాతం చొప్పున తగ్గాయి. ఇక మన ఎంసీఎక్స్ మార్కెట్‌లో కూడా ఈ రెండు మెటల్స్ నష్టాలతో ట్రేడవుతున్నాయి. పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం (మార్చి కాంట్రాక్ట్‌) ధర రూ. 85875 నుంచి రూ. 84,879లకు పడింది. ఇపుడు రూ. 85044 వద్ద ట్రేడవుతోంది. అలాగే కిలో వెండి ధర ఎంసీఎక్స్‌లో రూ. 96488 నుంచి రూ. 95049లకు అంటే సుమారు రూ. 1500 తగ్గింది.