టోల్ చార్జీలు 80% తగ్గించండి

దేశ వ్యాప్తంగా టోల్ చార్జీలపై ప్రభావం చూపేలా జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. రోడ్ల నిర్మాణం నాసిరకంగా ఉండటమే గాక.. . నిర్వహణ చెత్తగా ఉన్న రోడ్లపై టోల్‌ను తగ్గించాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాని ఆదేశించింది. ముఖ్యంగా పఠాన్‌కోట్ నుంచి ఉధమ్‌పూర్ మధ్య రోడ్డు చాలా దారుణంగా ఉందని హైకోర్టు బెంచ్ పేర్కొంది. ఇలాంటి చెత్త రోడ్లపై చార్జీలను కేవలం 20 శాతానికి తగ్గించాలని ఆదేశించింది. తమ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేసింది. రోడ్ల నిర్వహణపై వేసిన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సమయంలో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 60 కి.మీ. మధ్యలో మరో టోక్ గేట్ ఉండటానికి వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఉంటే వాటిని రెండు నెలల్లో తొలగించాలని పేర్కొంది. కేవలం జనం నుంచి భారీగా సొమ్ము రాబట్టేందుకే ఈ రోడ్లు వేసినట్లు కన్పిస్తోందని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశం సంచలనం కల్గిస్తోంది. ఎందుకంటే దాదాపు చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. మరి దీనికి ఎన్‌హెచ్‌ఏఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.