ఇవాళ నో నాన్‌వెజ్ డెలివరీ

మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ కొన్ని నగారల్లో నాన్ వెజ్ ఐటమ్స్ డెలివరీని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నిలిపివేసింది. పండుగ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గుడ్లు, చికెన్, మాంసంతో పాటు చేపలు వంటి నాన్ వెజ్ ఐటమ్స్ డెలివరీని ఇవాళ ఇన్‌స్టామార్ట్ ఆపేసినట్లు అనేక మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. న్యూఢిల్లీ, పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఈ సేవలను ఆపినట్లు సమాచారం. సోషల్ మీడియాలో అనేక మంది తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో సాయంత్రం మళ్ళీ నాన్ వెజ్ ఐటమ్స్ డెలివరీని ఇన్‌స్టామార్ట్ ప్రారంభించినట్లు సమాచారం. మరోవైపు శ్రీ కాశి విశ్వనాథ్ ఆలయం నుంచి నేరుగా తాండూల్ మహాప్రసాద్ లడ్డూలను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డెలివరీ చేసింది. ఉత్తరాదిలోని అనేక ప్రముఖ నగరాల్లో ఈ సేవలను అందించింది.