రూ. 1000 తగ్గిన బంగారం

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికాలో కన్జూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ తగ్గడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాల కారణంగా దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీంతో డాలర్ క్షీణించింది. ఫలితంగా కమాడిటీస్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడింది. క్రూడ్ ఆయిల్ కూడా రెండు శాతం తగ్గింది. అమెరికా మార్కెట్‌లో బంగారం ధర రెండు శాతం తగ్గి 2906 డాలర్లకు చేరింది. వెండి ధర మూడు శాతం తగ్గి 31.66 డాలర్లకు పడిపోయింది. అయితే మన మార్కెట్‌లో మాత్రం ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర ఒక శాతం మాత్రమే తగ్గింది. డాలర్‌తో రూపాయి బలపడటమే దీనికి కారణమని చెప్పొచ్చు. ఇవాళ ఉదయం ఫ్యూచర్స్ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. 86,575లు పలకగా… అమెరికా మార్కెట్ ప్రారంభమైన వెంటనే రూ. 85225 లకు పడిపోయింది. ఇపుడు రూ.85344 వద్ద ట్రేడవుతోంది. ఆప్షన్స్ ట్రేడింగ్‌లో బంగారం కాల్స్ ధరలు డబుల్ కావడం విశేషం.