22,700 దిగువకు నిఫ్టి?

నిఫ్టిలో పతనం కొనసాగనుంది. నిఫ్టికి ఎక్కడా మద్దతు కన్పించడం లేదు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరంభంలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలను మార్కెట్ విస్మరించినా… ఇపుడు పరిస్థితి అలా లేదు. ఇన్వెస్టర్లలో మార్కెట్‌పై నమ్మకం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా కార్పొరేట్ ఫలితాల పట్ల మార్కెట్ నిరాశతో ఉంది. పైగా ట్రంప్ ఆంక్షల భయం కొనసాగుతూనే ఉంది. ఇవాళో, రేపు భారత ఉత్పత్తులపై అమెరికా ఆంక్షలు విధించే అవాకశముంది. ఈ నేపథ్యంలో తాజా పొజిషన్స్‌కు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. నిఫ్టి ఇవాళ 22700 దిగువన ప్రారంభం కానుంది. నిఫ్టి గత శుక్రవారం 22795 వద్ద ముగిసింది. ఇవాళ గిఫ్ట్ నిఫ్టి 120 పాయింట్ల నష్ఠంతో ఉంది. అంటే నిఫ్టి ఇవాళ 22700 స్థాయిని కోల్పోనుంది. నిఫ్టికి అత్యంత కీలక స్థాయి 22800 కాగా, 22700ని కోల్పోతే మాత్రం నిఫ్టికి 22500 వద్ద మాత్రమే మద్దతు అందుతుందని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. ఇవాళ హాస్సిటల్ రంగానికి చెందిన షేర్లకు మద్దతు లభించే అవకాశముంది. బెంగళూరుకు చెందిన క్యాన్సర్ హాస్పిటల్ చైన్ హెచ్‌సీజీని ప్రముఖ పీఈ సంస్థ కేకేఆర్ కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం ఈ కంపెనీలో మెజారిటీ వాటా సీవీసీకి ఉంది. డీల్ విలువ 40 కోట్ల డాలర్లుగా భావిస్తున్నారు.