For Money

Business News

23,000 పాయే…

గిఫ్ట్‌ నిఫ్టి ఉదయం నుంచి లాభాల్లో ఉన్నా.. నిఫ్టి ఓపెనింగ్‌లోనే నిరుత్సామపర్చింది. ఆరంభంలోనే 23000 స్థాయిని కోల్పోయింది. ప్రస్తుతం 76 పాయింట్ల నష్టంతో 22995 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ భారత ప్రధాని మోడీ అమెరికా చేరుకుంటున్నారు. రేపు ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ నుంచి ఆంక్షల బయం ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మాటలను మార్కెట్‌ విశ్వసించడం లేదు. ఏదో ఒక రూపంలో భారత ఉత్పత్తులపై అమెరికా ఆంక్షలు విధిస్తుందని అంటున్నారు. మరోవైపు మిడ్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాల జోరు అధికంగా ఉంది. మిడ్‌ క్యాప్‌ సూచీ ఓపెనింగ్‌లోనే ఒక శాతం మేర నష్టపోయింది. ఐటీ మినహా దాదాపు అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌ అన్నీ ఐటీ రంగ షేర్లు కావడం గమనార్హం. అయితే లాభాలన్నీ నామ మాత్రంగానే ఉన్నాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఎం అండ్‌ ఎం ఉంది. మిడ్‌ క్యాప్‌ సూచీలో ఐడియా, ఏయూ బ్యాంక్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, కో ఫోర్జ్‌, డిక్షన్‌ షేర్లు రెండు శాతం నష్టంలో ట్రేడవుతున్నాయి.