For Money

Business News

మిడ్‌ క్యాప్స్‌లో అమ్మకాలు

నిఫ్టి స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. తాజా సమాచారం మేరకు క్రితం ముగింపుతో పోలిస్తే 73 పాయింట్ల నష్టంతో 23308 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. నిఫ్టి బ్యాంక్‌ కూడా అర శాతం నష్టంతో ఉంది. అయితే నిజమైన ఒత్తిడి మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ కౌంటర్‌లో కన్పిస్తోంది. మిడ్‌ క్యాప్స్‌ సూచీ, నిఫ్టి నెక్ట్స్‌ 50 సూచీలు ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో 31 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఇవాళ రెండు శాతంపైగా లాభంతో నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. దాదాపు ఆరు శాతం నష్టంతో ఐషర్‌ మోటార్స్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది.