For Money

Business News

ఫార్మాపై అమెరికా సుంకాలు?

రాత్రి స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ త్వరలోనే మరికొన్ని ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నారు. ఈ మేరకు అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాత్రి కెనడా, మెక్సికో, బ్రెజిల్‌ దేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. త్వరలోనే కార్లు, చిప్స్‌తో పాటు ఫార్మాస్యూటికల్స్‌పై కూడా సుంకాలు విధించే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలను అమెరికా టార్గెట్‌ చేస్తోంది.