For Money

Business News

లాభంలో 84 శాతం వృద్ధి

డిసెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్కెట్‌ అంచనాలను అధిగమించింది. ఈ త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.16,891 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన నికర లాభః రూ.9163 కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 84 శాతం పెరిగింది. ఈటీ నౌ ఛానల్‌ సర్వేలో పాల్గొన్న విశ్లేషకులు బ్యాంక్‌ రూ. 16,219 కోట్ల నికరలాభం ఆర్జిస్తుందని అంచనా వేశారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 4 శాతం పెరిగి రూ.39,816 కోట్ల నుంచి రూ. 41, 620 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం మాత్రం రూ.1.06 లక్షల కోట్ల నుంచి 10 శాతం పెరిగి రూ.1.17 లక్షల కోట్లకు చేరినట్లు బ్యాంక్‌ వెల్లడించింది.