For Money

Business News

స్థిరంగా ప్రారంభం

స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ స్థిరంగా ప్రారంభమైంది. 23800పైన నిఫ్టి ప్రారంభమైనా.. ప్రస్తుతం 30 పాయింట్ల లాభంతో 23760 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి కన్నా మిడ్‌ క్యాప్స్, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో మంచి ర్యాలీ వస్తోంది. చాలా రోజుల తరవాత ఈ2ఈ షేర్‌ అప్పర్‌ సీలింగ్‌ వద్ద ఓపెనైంది. అలాగే హెచ్‌పీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, కుమిన్స్‌ కూడా ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్స్‌ జీఎస్‌డబ్ల్యూ ఎనర్జి, యూనియన్‌ బ్యాంక్‌తో పాటు జియో ఫైనాన్స్‌ మూడు శాతంపైగా లాభంతో ఉన్నాయి. నిఫ్టిలో బీపీసీఎల్‌ టాప్‌ గెయినర్‌ గా నిఫ్టి లూజర్స్‌లో ఏషియన్‌ పెయింట్స్‌ నాలుగున్నర శాతం నష్టంతో ట్రేడవుతోంది.