23,500పైన నిఫ్టి

మార్కెట్ బడ్జెట్ ముందు జోష్ కన్పిస్తోంది. నిజానికి ప్రతిరోజూ డే ట్రేడర్స్‌కు కాసుల పంట పండిస్తోంది. పడినపుడు రోజూ కాస్త పెరగడం… అక్కడి నుంచి కనిష్ఠ స్థాయికి చేరడం. ఇపుడు రోజూ దిగువ స్థాయి నుంచి గరిష్ఠ స్థాయి వద్ద క్లోజ్ కావడం. ఇవాళ 23227 పాయింట్లను తాకిన నిఫ్టి 23546 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. మిడ్ సెషన్ తరవాత 2 గంటల వరకు పడిన మార్కెట్ వెంటనే కోలుకుంది. క్లోజింగ్‌లో ఆకర్షణీయ లాభాలు గడించింది. ఇవాళ అనేక రంగాల సూచీలు ఒక శాతంపైగా లాభాలతో ముగిశాయి. ఫార్మా, నిఫ్టి ఫైనాన్షియల్, నిఫ్టి ఐటీ రంగాలు ఒక మోస్తరు లాభాలకు పరిమితమయ్యాయి. ఇవాళ ఎనర్జి, రియాల్టి, ఆటో, కమాడిటీ, సెంట్రల్ పీఎస్‌యూ సూచీలు భారీగా లాభపడ్డాయి. ఇవాళ మార్కెట్‌లో ప్రతి నాలుగు షేర్లకు మూడు షేర్లు లాభాల్లో ముగిశాయి.171 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో ముగిశాయి. నిఫ్టి టాప్ లూజర్స్‌లో భారతీ ఎయిర్‌టెల్ ఉంది. షేర్లన్నీ నామ మాత్రపు నష్టాలతో ముగిశాయి. ఇక నిఫ్టి టాప్ గెయినర్స్‌లో టాటా కన్జూమర్ టాప్‌లో నిలిచింది. ఈ షేర్ ఆరు శాతం పెరిగింది. మిగిలిన వాటిలో బీఈఎల్, ట్రెంట్, కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ షేర్లు నాలుగు శాతంపైగా లాభంతో ముగిశాయి.