For Money

Business News

ఊచకోత అంటే ఇదేనేమో?

ట్రంప్‌ చేతిలో అధికారం చూస్తుంటే… పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. అమెరికా ఫస్ట్‌ అంటూ ప్రపంచాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నట్లు కన్పిస్తోంది. అక్రమ వలసదారులు ఉన్న విమానం అనుమతించలేదని కాంబోడియాపై ట్రంప్‌ విధించిన ఆంక్షలతో ప్రపంచ మార్కెట్లన్నీ కంగుతిన్నాయి. దాదాపు అన్ని కీలక రంగాలను దెబ్బతీసేలా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. హెచ్‌ఐవీ ఎయిడ్స్‌కు ఇస్తున్న సాయం ఆపేయడంతో భారత్‌కు చెందిన పలు ఫార్మా కంపెనీలు దెబ్బతిన్నాయి. మరోవైపు చైనా కూడా అమెరికాకు చాలా గట్టిగా సమాధానం ఇస్తోంది. ఏఐ రంగంలో చైనా వ్యూహాలతో అమెరికా కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి. ఎన్‌విడా ఇపుడు 10 శాతం నష్టంతో ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో ట్రేడవుతోంది. ఇంత దరిద్రపు పరిస్థితుల్లో ఇవాళ మార్కెట్‌ చాలా నిరాశాజనకంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి నష్టాల్లోనే ఉంది. కోలుకున్న ప్రతిసారీ రెట్టింపు దెబ్బపడింది. దీంతో అత్యంత 23000 స్థాయిని నిఫ్టి ఇవాళ కోల్పోయింది. 22786 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి 22829 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 263 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టిలో 42 షేర్లు నష్టాలతో ముగిశాయి. ఇవాళ ట్రేడైన షేర్లలో ప్రతి పది షేర్లకు కేవలం ఒక షేర్‌ మాత్రమే గ్రీన్‌లో ఉంది. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌తోపాటు ఐటీ రంగంలో రక్తపాతమే. సూచీలు మూడు శాతం పైనే నష్టపోయాయి. అనేక షేర్లు ఇవాళ లోయర్‌ సీలింగ్‌ వద్ద ముగిసింది. ముఖ్యంగా అమెరికాతో లింక్‌ ఉన్న అనేక కంపెనీల షేర్ల పరిస్థితి దారుణంగా ఉంది.