For Money

Business News

మళ్ళీ బేజారు…

నిఫ్టి ఇవాళ డల్‌గా ఉంది. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైనా… వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం దాదాపు క్రితం స్థాయి వద్దే కొనసాగుతోంది. ఇవాళ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్తో పాటు బ్యాంకు షేర్లు కూడా డల్‌గా ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి నిరుత్సాహకర ఫలితాలు రావడంతో.. ఫార్మా కౌంటర్లలో అమ్మకాలు వస్తున్నాయి. నిఫ్టి ప్రస్తుతం 17 పాయింట్ల లాభంతో 23222 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి టాపర్స్‌లో పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌ షేర్లు ఉన్నాయి. ఇక రెడ్డీస్‌ ల్యాబ్ షేర్‌ ఆరు శాతంపైగా నష్టంతో ప్రారంభమైంది. ఇపుడు నాలుగున్నర శాతం నష్టంతో నిఫ్టి లూజర్స్‌లో టాప్‌లో ఉంది. అపోలో హాస్పిటల్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌, టాటా మోటార్స్‌, కొటక్‌ బ్యాంకు కూడా నిఫ్టి టాపర్స్‌ జాబితాలో ఉన్నాయి.