ఇక రూ. 250తోనే SIP?

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కనీస మొత్తాన్ని రూ. 250కు తగ్గించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. దీనికి సంబంధిచిన సంప్రదింపుల నివేదికను విడుదల చేసింది. ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టేందుకు కనీసం SIP మొత్తం రూ 500గా ఉంది. దీన్ని రూ. 250కు తగ్గించాలని భావిస్తోంది సెబి. అయితే దీన్ని కేవలం మూడు స్కీమ్‌లకు మాత్రమే పరిమితం చేయాలని భావిస్తున్నారు. చిన్న ఇన్వెస్టర్లతో పాటు గ్రామీణ ప్రాంత ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను పెంచేందుకు సెబీ ఈ ప్రతిపాదన తెచ్చింది. గ్రోత్ ఆప్షన్ ప్లాన్‌లకు మాత్రమే దీన్ని పరిమితం చేయనున్నారు. దీనికి అయ్యే ఫీజును కూడా తగ్గించాలని సెబీ భావిస్తోంది. కేవైసీ నిబంధనలను సరళతరం చేస్తారు. ఫీజు మొత్తాన్ని సెబీ వద్ద ఉన్న ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ నుంచి చెల్లించాలని కూడా సెబీ భావిస్తోంది.