For Money

Business News

తొలి రోజే 17 రెట్లు

సెకండరీ మార్కెట్ నష్టాలతో ఏడుస్తుంటే… ప్రైమరీ మార్కెట్‌లో ఇంకా మజా కొనసాగుతోంది. లిస్టయిన అనేక కొత్త ఇష్యూ నష్టాలతో ట్రేడవుతున్నా… కొత్త ఇష్యూలపై ఇన్వెస్టర్లకు ఇంకా మోజు తగ్గలేదు. ఇవాళ పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చిన వాటర్‌ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సొల్యూషన్‌ కంపెనీ డెంటా వాటర్‌ పబ్లిక్‌ ఇష్యూకు తొలిరోజే విశేష ఆదరణ లభించింది.
బిడ్డింగ్‌ మొదలైన క్షణాల్లో పూర్తి సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. ఇష్యూలో భాగంగా ఈ కంపెనీ 52.50 లక్షల షేర్లను ఆఫర్‌ చేయగా ఇప్పటి వరకు 9,07,15,200 షేర్లకు బిడ్లు నమోదయ్యాయి. మొత్తం ఇష్యూ 17.29 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ కాగా, ఒక్క రిటైల్‌ విభాగమే 18 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. అత్యధికంగా రూ. పది లక్ష లోపు ఎన్‌ఐఐ విభాగం 42 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది.