ధరలు పెంచిన ఎంజీ..

తన పాపులర్ ఎలక్ట్రిక్ కారు విండ్సార్ ఈవీ ధరలను జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా పెంచింది. అన్ని రకాల మోడల్ ధరలను రూ.50 వేలు పెంచుతున్నట్లు ఇవాళ ప్రకటించింది. ఆరంభ ఆఫర్ కింద ఇచ్చిన ఫ్రీ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా ఆపివేస్తున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ నెలాఖరుకల్లా ఈ ఆఫర్లను ఆపేస్తున్నట్లు కంపెనీ ఇదివరకే ప్రకటించింది. అలాగే ఆరంభ ఆఫర్ కింద 10వేల యూనిట్లను కంపెని విక్రయించింది. ఫస్ట్ యజమానికి ఈవీ బ్యాటరీపై లైఫ్‌టైమ్ ఉచిత వారెంటీ సదుపాయం మాత్రం కొనసాగిస్తామని, అయితే ఉండగా.. వారి నుంచి కారు కొనుగోలు చేసేవారికి మాత్రం 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు మాత్రమే వారెంటీని ఇస్తామని తాజాగా వెల్లడించింది. విండ్సర్ను ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 331 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. మల్లిపుల్ సపోర్ట్ చార్జింగ్ సదుపాయన్ని కూడా కంపెనీ అందిస్తోంది. దీనివల్ల డీసీ ఫాస్ట్ చార్జింగ్ విధానంతో 10 శాతం నుంచి 80 శాతానికి బ్యాటరీని కేవలం 55 నిమిషాల్లో చార్జ్ చేసే సౌకర్యం ఉంది. అలాగే పోర్టబుల్ చార్జర్‌తో పాటు ఇంటి వద్ద పెట్టుకునే వాల్‌బాక్స్ చార్జింగ్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.