For Money

Business News

దుమ్మురేపుతున్న వాల్‌స్ట్రీట్‌

ఎక్కడ లేని వైరస్‌ గోల మన మార్కెట్లలోనే. ప్రపంచ మార్కెట్లేవీ ఈ వైరస్‌ను పట్టించుకోవడం లేదు. ఇవాళ కూడా వాల్‌స్ట్రీట్‌ భారీ లాభాల్లో ట్రేడవుతోంది. ముఖ్యంగా ఐటీ, టెక్‌ షేర్లు దుమ్మురేపుతున్నాయి. నాస్‌డాక్‌ ఒకటిన్నర శాతంపైగా లాభాలతో ఉంది. ఇక డౌజోన్స్ అర శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు కూడా 1.27 శాతం లాభంతో ఉన్నాయి. ఇవాళ చిప్‌ తయారీ కంపెనీల షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఫాక్స్‌కాన్‌ ఫలితాలు మార్కెట్‌ అంచనాలు మించడంతో ఎన్‌విడియా, మైక్రాన్‌తో పాటు బ్రాడ్‌కామ్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు డాలర్‌ స్థిరంగా ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ 108 వద్ద ఉండగా, బులియన్ స్వల్ప నష్టంతో ఉన్నాయి. క్రూడ్‌ ధరలు మాత్రం ఇవాళ కూడా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 77 డాలర్లకు చేరువగా ఉంది.