నిమిషాల్లో సూపర్ హిట్

హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీస్ పబ్లిక్ ఆఫర్ ఇవాళ ఓపెనైంది. ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే ఇష్యూ పూర్తిగా సబ్‌స్క్రయిబ్ కావడం విశేషం. ఫార్మా, కెమికల్ రంగానికి చెందిన ఎక్విప్‌మెంట్ తయారీలో నిమగ్నమైన ఈ కంపెనీ మార్కెట్ నుంచి రూ. 410 కోట్ల సమీకరణకు పబ్లిక్ ఇష్యూ చేసింది. ఇందులో కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 200 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 210 కోట్లను సమీకరిస్తున్నారు. పబ్లిక్ ఆఫర్‌లో 35 శాతం రీటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. ఈ వాటా ఇవాళ నాలుగు రెట్లకు పైగా ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది. మొత్తం ఇష్యూ 3.22 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాటా కూడా 4.42 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది. రూ. 133- రూ. 140 ధరతో ఈ ఇష్యూను కంపెనీ ఆఫర్ చేసింది. ఈనెల 13వ తేదీన కంపెనీ షేర్లు లిస్ట్ కానున్నాయి.