NIFTY TRADE: నిఫ్టిని అమ్మడమే
అన్ని సాంకేతిక సూచీలు అమ్మకాలను సూచిస్తున్నాయి. నిన్న 16,620ని దాటడంతో నిఫ్టి అధిక స్థాయిలో నిలదొక్కుకుంది. నిఫ్టి ఇవాళ కూడా పెరిగితే అమ్మడానికి మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. రేపు వీక్లీ, నెలవారీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. నిఫ్టి క్రితం ముగింపు 16,624. సింగపూర్ నిఫ్టి 35 పాయింట్ల లాభం చూపుతోంది. నిఫ్టి గనుక 16675ని దాటితే అమ్మండి. స్టాప్‌లాస్ 16,700. 16725 దాటితే నిఫ్టిలో అప్‌ట్రెండ్‌కు ఛాన్స్ ఉంది. కాని ఇవాళ ఆ పరిస్థితి రాకపోవచ్చు. రిస్క్ తీసుకునేవారు ఓపెనింగ్‌లో అంటే 16650 దాటితే నిఫ్టిని అమ్మొచ్చు. నిన్నటి మాదిరే ఇవాళ కూడా కీలక స్థాయిని గమనించండి. నిన్న కీలకస్థాయికి పడిన నిఫ్టి… అక్కడి నుంచి కోలుకుని 150 పాయింట్లకుపైగా లాభపడింది.ఇవాళ్టికి కీలక స్థాయి 16,580. ఈ స్థాయి దిగువకు వస్తే నిఫ్టి 16,560కి చేరే అవకాశముంది. దిగువ స్థాయిలో కొనుగోలు చేయడం కంటే.. పై స్థాయిలో అమ్మి స్వల్ప లాభాలతో బయటపడండి. నిఫ్టి పెరిగితే.. ఛాన్స్ మిస్సవుతున్నామని ఫీల్ కానక్కర్లేదు. నిన్న కూడా విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరిపారు. అధిక స్థాయిలో అమ్మడం స్వల్ప లాభంతో బయటపడటం మంచిది. ఒకవేళ నిఫ్టి పెరిగితే స్టాప్‌లాస్ వద్ద బయటపడటం మంచిది.