నష్టాల్లో వాల్‌స్ట్రీట్

అమెరికా మార్కెట్లు రెండోరోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గత శుక్రవారం మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఫ్యూచర్స్ కూడా నష్టాల్లోనే ఉన్నా… ఓపెనింగ్ సమాయానికి భారీగా పెరిగాయి. శుక్రవారంలాగే ఇవాళ కూడా నాస్డాక్ 1.34 శాతం నష్టంతో ఉంది. ఎస్ అండ్ పీ 500, డౌజోన్స్ కూడా ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. సంవత్సరాంతం కావడంతో ట్రేడింగ్ పరిమాణం కూడా అంతంత మాత్రమే ఉంది. చాలా మంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దాదాపు అన్ని సూచీలు ఈ సంవత్సరం బాగా రాణించడంతో లాభాల స్వీకరణ సహజమే. మరోవైపు డాలర్ ఇవాళ మరింత పెరిగింది. డాలర్ ఇండెక్స్ 108ని దాటడంతో పాటు బ్రెంట్ క్రూడ్ 74 డాలర్లను కూడా దాటడం విశేషం. డాలర్ బలం నేపథ్యంలో బులియన్ మార్కెట్ బలహీనంగా ఉంది.